ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి
మెట్రో దినపత్రిక 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన
*జిల్లా అదనపు కలెక్టర్ పి, రాం బాబు*
ప్రజాస్వామ్యం లో దినపత్రిక లు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని జిల్లా అదనపు కలెక్టర్ పి, రాంబాబు అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెట్రో తెలుగు దినపత్రిక 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను మెట్రో దినపత్రిక సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉయ్యాల నరసయ్య ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మెట్రో దినపత్రిక వారధిగా ఉంటూ నిజాలను నిర్భయంగా రాస్తూ పత్రికా రంగంలో ప్రత్యేక స్థానం పొందిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో ఇరవై ఎనిమిది ఏళ్లుగా మెట్రో ఈవినింగ్స్ తెలుగు దినపత్రిక విశ్లేషణాత్మకమైన కథనాలను ప్రజలకు అందించడం అభినందనీయమన్నారు. ఫోర్త్ ఎస్టేట్ రంగంగా పత్రికల పాత్ర ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే, ఐ జేయు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, జర్నలిస్టులు తండు వెంకన్న,దోసపాటి అజయ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.