బిజెపి నాయకులు మాటిస్తే నెరవేర్చి తీరుతాం …..జన్యావుల రామకృష్ణ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని వార్డ్ 2 ఇందిరమ్మ నగర్, పోచమ్మ ఆలయం వెనక బస్తీలో సోమవారం పర్యటించిన రామకృష్ణ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. బిజెపి నాయకులు మాటమీద నిలబడతారని, మాటిస్తే తప్పకుండా నెరవేర్చితాం అని అన్నారు. అలాగే పోచమ్మ ఆలయం వెనక గల్లీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల బాదను పలు మీడియా మాధ్యమాలలో చూసి చలించిపోయి గత వారం క్రితం ఇక్కడ పర్యటించి స్థానికులను కలిసి సమస్య పరిష్కారం చేస్తానని మాటిచ్చామని అన్నారు.
ఇచ్చిన మాట మీద నేడు పనులు ప్రారంభించామని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిధులు, బోర్డు నిధులతో పనులు చేపడుతున్నామని తెలిపారు.
స్థానిక బిజెపి నాయకుల పోరాటం, వారి కృషి ఫలితంగా నేడు సమస్య తీరనుందని, ప్రజలు బిజెపి నాయకులు చేస్తున్న పనులు గుర్తించి బిజెపి కి అండగా నిలవాలని, ఏ ఎన్నిక వచ్చినా బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
డ్రైనేజీ నిర్మాణం పట్ల స్థానికుల హర్షం వ్యక్తం చేశారు.
గత కొన్ని ఏండ్లుగా డ్రెయినేజీ లేక, మురికినీటి లో దుర్వాసనతో అనేక ఇబ్బందులు పడ్డామని, మా ఇబ్బందిని గుర్తించిన బిజెపి నాయకులు, బోర్డ్ మెంబర్ రామకృష్ణ, బోర్డు సీఈఓ లు సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చి నేడు పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే బిజెపి నాయకులకు, బోర్డు మెంబర్ రామకృష్ణ ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వార్డ్ నెంబర్ 2 బిజెపి అధ్యక్షులు శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు మదారపు అశోక్, నాయకులు రేఖ, శ్యామ్, జై యాదవ్, ప్రశాంత్, జహంగీర్, స్థానిక బస్తీ వాసులు స్వామి, సాయి, దుర్గ ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.