హాస్టల్ నిద్రలో భాగంగా గురుకులాన్ని సందర్శించిన ఐ ఏ ఎస్ ప్రియాంక
ఐఏఎస్ హాస్టల్ నిద్రలో భాగంగా సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం గిరిజన గురుకుల పాఠశాలను శుక్రవారం రాత్రి సందర్శించి, విద్యార్థులతో మమేకమై మాట్లాడిన మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్మెంట్ డిప్యూటీ సెక్రటరీ సిహెచ్ ప్రియాంక. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రభుత్వ ఆదేశాల మేరకు గురుకులన్ని సందర్శించమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పోషకాలతో కూడిన ఆహారం అందించడం లక్ష్యం గా సాగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్టడీ అవర్ పరిశీలించి వారి పాఠ్య పుస్తకాల లోని ఎకనమిక్స్ 17 వ పాఠం లోని ప్రశ్నలను అడిగి వారి ద్వారా వచ్చిన సమాధానం మెచ్చుకున్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్య ముఖ్యమైనది, విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దుర్గాభవని, ఉపాధ్యాయులు సుజాత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.