హోరాహోరీగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ
వట్పల్లి మండలంలోని భూత్పూర్ శివారులో సంగారెడ్డి హోప్ న్యూరో ఆస్పత్రి సౌజన్యంతో లైన్స్ క్లబ్ వట్పల్లి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీలో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సోమవారం నాడు రెండవ లీగ్ మ్యాచ్ లో జోగిపేట- రేగోడ్ జట్లు తలపడ్డాయి. రేగోడ్ బ్యాటింగ్ ఎంచుకొని ఎనిమిది ఓవర్లో 66 స్కోర్ నిర్దేశిం చగా జోగిపేట టీంను 46కి కట్టడి చేసి రేగోడ్ క్రికెట్ వారియర్స్ గెలుపొందారు. ఈ మ్యాచ్ చక్కటి బ్యాటింగ్ తో చిన్న రాణించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లైన్స్ క్లబ్ అధ్యక్షుడు మొయినోద్దీన్ చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ స్థానిక యువకులు సహకారంతో మూడు నుంచి ఐదు మ్యాచులు ఆడిపిస్తున్నారని మ్యాచ్ లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నట్లు సభ్యులు సుబుద్ది, అలిమ్, షాదుల్, మైను తెలిపారు.