జాతిపిత మహాత్మగాంధీకి, ఆయన వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
మహాత్ముడు చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
“ఆరోగ్యమే మహాభాగ్యం” అని గాంధీ చెప్పిన మాటలను మంత్రి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన జీవనశైలి అలవర్చుకోవాలన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గుర్తు చేశారు.
దేశ చరిత్రలో అత్యంత ప్రముఖమైన ఆస్పత్రుల్లో ఒకటిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కోసం కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
ఈ నెల 31న(రేపు) కొత్త ఉస్మానియాకు శంకుస్థాపన చేసుకోబోతున్నామని తెలిపారు.