ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు
నృత్యాలు ఆట పాటలతో ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి
వట్పల్లి మండలంలోని అక్షర హై స్కూల్ లో 76 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఘనంగా వేడుకల జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర దేశముగా ఏర్పడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, విద్యార్థిని విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాలల విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మిలిటరీ యూనిఫామ్ లో చేసిన కవాతు దేశభక్తి నృత్యాలు పాటలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.