గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు దళితుడు, కంబలి రాములు పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్
రంగారెడ్డి జిల్లాలోని వంకేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో గిజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు దళితుడు, కంబలి రాములు పై మతోన్మాద మూకలు దాడి చేసి, పది రోజులు గడిచిపోయినా, ఇప్పటికి నిందితులను అరెస్టు చేయకుండా ప్రభుత్వం, పోలీసులు,ఉదాసీనత ప్రదర్శించడాన్ని, ఉపాధ్యాయ సంఘాలుగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఖండిస్తున్నాము కనుక దాడి చేసిన నిందితులను గుర్తించి, వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మోపి, చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్చేస్తున్నాంఒకఉపాధ్యాయుడుగా ఆయన తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు, కానీ,ఆ ఉపాధ్యాయుడు విద్యార్థిని కాళ్ళతో తన్నాడు అనే నిరాధార ఆరోపణలు చేసి ఆ ఉపాధ్యాయుని చేతనే విద్యార్థుల కాళ్లు మొక్కించి మతోన్మాదులు దాడి చేయడం హేయమైన చర్యగా పరిగణిస్తున్నాంఅంతే కాకుండా నిందితులపై ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి లు నమోదు చేసి, చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వ వైఖరిని, పోలీసుల వైఖరిని, ఖండిస్తున్నాంబాధితుడు దళితుడు అయినందువల్ల వెంటనే నిందితులపై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మోపి, జైలుకు పంపాలి. అప్పుడే రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు స్వేచ్ఛగా పనిచేసే మానసిక స్థితిని కల్పించినట్టు ఉంటుంది.ఉపాధ్యాయులకు రక్షణ కల్పించినట్టు ఉంటుందిఈ ఉదాసీన ప్రభుత్వ,పోలీసు వైఖరిని నిరసిస్తూ నేడు డెమొక్రటిక్టీచర్స్ఫెడరేషన్,యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మక్తల్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాముఈ కార్యక్రమానికి దాదాపు 30 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారహాజరైనవారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్రజిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి జిల్లా అధ్యక్షురాలు హైమావతి వేణుగోపాల్, స్పందన, రాఘవేంద్ర చారి, నగేష్, రాజు, హనుమంతు, శ్రీవిద్య, శిరీష, జయశ్రీ, రేణుక,కురుమూర్తి, మురళీధర్ రెడ్డి,కవిత
మొదలైన వారు పాల్గొన్నారు