కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్.. మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ 

కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్.. మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ 

 

 

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన కొల్చారంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వినతి పత్రాన్ని అందజేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగామండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా మాట్లాడుతూ… ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు కాలేవని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి తప్ప మిగిలిన పథకాలు ఎక్కడ అమలకు నోచుకోలేవని కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 420 రోజులు గడుస్తున్న హామీలను నెరవేర్చకపోగా స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలను ఖబర్దార్ అని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంట్ రాజా గౌడ్, ముత్యం ప్రవీణ్, ఎండుగుల కృష్ణ పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment