గాంధీ మహాత్ముని అహింసా మార్గం మానవాలికి ఆదర్శం
ఆర్య వైశ్య సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తల్లాడ వెంకట్రామారావు
మహాత్మ మోహనదాస్ కరంచంద్ గాంధీ అహింసా మార్గం మానవాలికి ఆదర్శమని
ఆర్యవైశ్య మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తల్లాడ వెంకట రామారావు అన్నారు , గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్నగాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు అహింసా మార్గం ద్వారా బ్రిటిష్ వారిని తరిమి కొట్టి భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చారు, ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని మంచి మార్గంలో నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాంలో మండల అధ్యక్షుడు తిపిరిశెట్టి గోవర్ధన్, సిటీ అధ్యక్షుడు కంది బండ ప్రసాద్, కిరాణా, వర్తక అస్సోసియేషన్ అధ్యక్షుడు కర్లపాటి మధు , సభ్యులు తల్లాడ సురేష్ వోబిలి శెట్టి వేణు, బొల్లం గణేష్, బుద్ధా శ్రీనివాస్, సోమా శ్రీనివాస్, గర్రెపల్లి జానకిరములు, గర్రేపల్లి నగేష్, కటకం కనకశేఖర్, తదితరులు పాల్గొన్నారు