జన్నారం మండలంలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద *ప్రజా యుద్ధ నౌక గద్దర్ 76వ జయంతి వేడుకలను మాల మహానాడు జన్నారం మండల కమిటీ ఆధ్వర్యంలో* ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు దాముక కరుణాకర్, మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాడిత పిడత వర్గాలకు సమ న్యాయం కోసం తన ఆట పాటల ద్వారా జీవితాంతం పోరాటం చేసిన విప్లవ కవి, ప్రజా గాయకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన సాహిత్యం ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన ప్రజా కవి ప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌక మన గద్దర్ అన్న అని గద్దర్ అన్న ఒక విప్లవం గద్దర్ అన్న ఒక లెజెండ్ అని, వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజన బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు గద్దర్ అన్న గారి యొక్క స్ఫూర్తి తీసుకొని వారి అడుగుజాడలలో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలపడం జరిగినది.ఇట్టి కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షులు దాముక కరుణాకర్ ఏఎంసీ చైర్మన్ దుర్గమ్ లక్ష్మీనారాయణ,వైస్ చైర్మన్. పసివుల్లా,మాజీ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్,మాజీ మండల అధ్యక్షులు జక్కుల సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్, నాయకులు సుభాష్ రెడ్డి, మోహన్ రెడ్డి,మిక్కిలినేని రాజశేఖర్,మాజీ సర్పంచులు అల్లం వెంకటరాజమ్ ,కోల పద్మారావు, మాజీ ఎంపిటిసి రియాజుద్దీన్,మాజీ ఏఎంసీ చైర్మన్. ముత్యం మామిడిపల్లి ఇందయ్య, ప్రవీణ్, సతీష్ మరియు సంఘ నాయకులు కోడి ఇసాక్ సిటీ మల్ల భరత్ కుమార్, బొట్ల సంజీవ్,లక్ష్మణ్,కండ్ల సతీస్,మరియు మాల యూత్ అధ్యక్షులు అంబటి శరత్,ప్రధాన కార్యదర్శి దాసండ్ల నవీన్,సుధాకర్ హరీష్,రాము,అజయ్, వెంకటేష్,పలు పార్టీల నాయకులు,గద్దర్ అభిమానులు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు..