చిరు వ్యాపారుల సమస్యను జీహెచ్ఏంసీ డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని ఆదుకోవాలి
నానక్ రామ్ గుడా చిరు వ్యాపారులకు బాసటగా నిలిచిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గుడా లో నెలకొన్న చిరు వ్యాపారుల సమస్య పై శుక్రవారం డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి మరియు టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో నానక్ రామ్ గుడాలోని రోడ్డు ప్రక్కల ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించడం పై చర్చించారు.ఎన్నో కుటుంబాల వారు చిరు వ్యాపారాల పై ఆధారపడి జీవనం కోనసాగిస్తున్నారని అన్నారు. చిన్న వ్యాపారస్తులు పలు రకాల చిన్న చిన్న వ్యాపారాలను నడుపుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం వారి బడ్డీ షాప్స్ తొలగింపు నిర్ణయంతో వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఎంతో కాలంగా వారు వారి వ్యాపారాల పై ఆధారపడి ఉన్నారని వారికి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి ని కోరారు. నానక్ రామ్ గుడా లో చిరు వ్యాపారులకు వారి జీవన భృతి కోల్పోకుండా వారికి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పూర్తిగా అండగా నిలవాలని కోరారు. ఈ సందర్బంగా డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి సానుకూలంగా స్పందించి తప్పకుండా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ జీషాన్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివ సింగ్, ఉపాధ్యక్షులు తిరుపతి , సీనియర్ నాయకురాలు వరలక్ష్మి ధీరజ్,సీనియర్ నాయకులు సుమన్,శేఖర్, కిషన్ గౌలీ,గోపాల్, శంకర్, శ్రీను, నానక్ రామ్ గుడా వాసులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు