వెంకటేష్ జ్ఞాపకర్థంతో చదువుకున్న పాఠశాలలో పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన స్నేహితులు
గత సంవత్సరం జనవరి 30న బ్రెయిన్ స్ట్రోక్ తో ఇరాక్ లో చనిపోయిన కునారపు వెంకటేష్ జ్ఞాపకార్థంగా వారి 10వ తరగతి స్నేహితులు వెంకటేష్ చదువుకున్న పాఠశాలలో పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులు శ్రీనివాస్,ప్రకాష్, రాజన్న,రవీంధర్,మహాత్మ, పోచయ్య, అనుపమ,సంధ్యారాణి గార్లక వెంకటేష్ స్నేహితులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో స్నేహితులు కృష్ణ , సల్మాన్,గణేష్ ,సతీష్ కుమార్ , అనీల్ కుమార్,మనోహర్,నాని పాల్గొన్నారు.