అంత్యక్రియలో పాల్గొన్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే
కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిశ్రా తండ్రి శశాంక్ శేఖర్ మిశ్రా బుధవారం ఉదయం మరణించారు. విషయం తెలుసుకున్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పేపర్ మిల్లు జీఎం గిరి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.