మాజీ శాసనసభ్యులు, తాజామాజీ బల్దియా చైర్మన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు
తుప్రాన్ పురపాలక సంఘ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ముగ్దులై శని
వారం గజ్వేల్ మాజీ శాసనసభ్యులు తూముకుంట నర్సారెడ్డి అధ్యక్షతన మరియు తూప్రాన్ తాజా మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజు ఆధ్వర్యంలో 4వ వార్డుకు చెందిన గుజ మహేష్ యాదవ్, యండి ఫక్రుద్దీన్ మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎలక్షన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమన్న గారి భాస్కర్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెర్ల రవీందర్ గుప్తా, బజారు విశ్వరాజ్ ,మాజీ కౌన్సిలర్లు కొడిప్యాక నారాయణ గుప్తా,జిన్న భగవాన్ రెడ్డి,చింత రవీందర్ రెడ్డి, బాణాపురం రాజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నాగరాజుగౌడ్ చిట్టిమిల అనిల్ తిమ్మాపురం నరసింహులు తీగుళ్ల అజయ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.