ఫోక్సో కేసులో నేరస్తునికి 20 సంవత్సరాల జైలు శిక్ష !!

ఫోక్సో కేసులో నేరస్తునికి 20 సంవత్సరాల జైలు శిక్ష !!

 

కేవలం ఐదు నెలల్లోనే ట్రాయ ల్ పూర్తి చేసి నేరస్థునికి శిక్ష విధించడం జరిగింది.

 

నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు

 

నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు.

 

*పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఐపీఎస్

సిద్దిపేట్ పవర్:

 

*నేరస్తుని వివరాలు*

 

అజయ్ తండ్రి డోదనాథ్, వయస్సు 30 సంవత్సరములు, వృత్తి పెయింటింగ్, నివాసం రసులాపూర్ డిస్టిక్ గోరఖాన్పూర్ రాష్ట్రం ఉత్తర ప్రదేశ్, ప్రస్తుత నివాసం గో గ్రీన్ గ్రాండ్ ఇంటిగ్రేటెడ్ అపార్ట్మెంట్ గ్రామం పొన్నాల, మండలం సిద్దిపేట్.పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఐపీఎస్ మేడం గారు కేసు వివరాలు తెలియపరుస్తూ ఫిర్యాది గో గ్రీన్ గ్రాండ్ ఇంటిగ్రేటెడ్ అపార్ట్మెంట్ గ్రామం పొన్నాల, మండలం సిద్దిపేట్. నందు వాచ్ మెన్ పనిచేస్తున్నాడు తేదీ: 19-08-2024 నాడు మధ్యాహ్నం సమయమున తన 3 సంవత్సరాల మనమరాలను పై నేరస్తుడు పాపతో ఆడుకుంటానని తన రూములకు తీసుకొని వెళ్లి మానభంగం చేసినాడని ఫిర్యాది దరఖాస్తు ఇవ్వగా త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ మేడం గారు కేసు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా నేరస్తునికి శిక్ష పడే విధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కేసు పరిశోధన ప్రారంభించి పై నేరస్తుని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగింది. తదుపరి టెక్నికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కేసు పరిశోధన పూర్తిచేసి నేరస్తునిపై కోర్టులో చార్జిషీట్ వేయడం జరిగింది.ఆరోజు నుండి ఈరోజు వరకు సిద్దిపేట 1st అడిషనల్ డిస్టిక్ & సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఈరోజు డిస్టిక్ ప్రిన్సిపల్ & సెషన్స్ జడ్జి శ్రీమతి సాయి రమాదేవి, మేడమ్ గారు ఇరువురి వాదనలు విన్న తర్వాత నేరస్తుని పై నేరం రుజువైన నందున పై నేరస్తునికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధించడం జరిగింది.త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, కోర్ట్ మానిటర్ ఇన్స్పెక్టర్ కమలాకర్, కోర్టులో సాక్ష్యం ఎలా చెప్పాలో సాక్షులను మోటివేట్ చేయడం జరిగింది.నేరస్థునికి జైలు శిక్ష పడడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్ లింగం, తన వాదనలు వినిపించారు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, కోర్ట్ మానిటర్ ఇన్స్పెక్టర్ కమలాకర్, కోర్టు కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లు స్రవంతి స్వామి, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ లోకేష్, భరోసా సెంటర్ సిబ్బంది సౌమ్య, హరిత, కీలక పాత్ర వహించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు విధులు నిర్వహించే అధికారులను సిబ్బందిని అభినందించారు. త్వరలో సన్మానించి నగదు పురస్కారం అందజేస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment