స్త్రీ నిధి ఋణాలు పారదర్శకంగా పాస్ మిషన్స్ ద్వారా తిరిగి వసూళ్లు చేయాలి
స్త్రీ నిధి ఋణాలు పారదర్శకంగా పాస్ మిషన్స్ ద్వారా తిరిగి వసూళ్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పాస్ మిషన్స్ లను స్లం ( ఏరియా లెవెల్ ఫెడరేషన్) సమైఖ్య ప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు.రాష్ట్రం లోని మొదటి సారిగా స్లం సమైఖ్య ప్రతినిధులకు అందజేయడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీ నిధికి సంబంధించిన ఋణాలు సులభంగా పారదర్శకంగా, బ్యాంకులకు వెళ్ళనవసరం లేకుండా పాస్ యంత్రాల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాస్ మేషిన్స్ ద్వారా ఋణాలు వంద శాతం సకాలంలో చెల్లించాలని సమైఖ్య ప్రతినీధులకు సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా పథక సంచాలకులు శ్రీధర్ రెడ్డి, స్త్రీ నిధి రీజనల్ మేనేజర్ కిరణ్ కుమార్, సమైఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.