రైతు భరోసా దరఖాస్తులు సకాలంలో అందించాలి
మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి
వట్పల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మండల రైతు వేదికలో రైతు భరోసా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా పథకం లో భాగంగా 31-12-2024 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు మరియు ఇదివరకు పాస్ పుస్తకం వచ్చి రైతు భరోసా, రైతుబంధు పథకం కింద దరఖాస్తు చేసుకోని రైతులు అందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తో బ్యాంక్ ఎకౌంటు సేవింగ్ ఖాతా ఈ కేవైసీ పూర్తి అయిన జిరాక్స్ లతో దరఖాస్తు ఫారం నింపి వ్యవసాయ శాఖ కార్యాలయంలో లేదా మీ మీ గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు 26-1-2025 లోపు ఇవ్వగలరని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద అకౌంట్ నెంబర్ మార్పులు లేదా వేరే కారణాలతో ఎకౌంట్ నెంబర్లు మార్చాలనుకునే రైతులు కూడా 26-1-2025 వరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు ఫారం మీద రాసి ఇవ్వగలరని కోరారు.