నకిలీ ఐఏఎస్ అమృత రేఖ… ప్రకాశం జిల్లాలో అరెస్ట్
ట్రైనీ ఐఏఎస్ అధికారినంటూ మోసాలు
విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు గుర్తింపు
ట్రైనీ ఐఏఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న అమృత రేఖ అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త గతంలో అరెస్ట్ కాగా, అతడు బెయిల్ పై బయట ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ అమృత రేఖ అనేకమందికి టోకరా వేసింది. విశాఖపట్నంలోని కంచరపాలెం పీఎస్ లోనూ, నగరంలోని పలు ఇతర పోలీస్ స్టేషన్లలోనూ ఆమెపై పలు ఫిర్యాదులు దాఖలయ్యాయి.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఆమెను పట్టుకునేందుకు 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు గుర్తించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నకిలీ ఐఏఎస్ అని తేల్చారు