భారత బడ్జెట్ దళితుల సంక్షేమానికి కేటాయింపుల్లో విఫలమైంది

భారత బడ్జెట్ దళితుల సంక్షేమానికి కేటాయింపుల్లో విఫలమైంది

 

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కే వి పి ఎస్) జిల్లా కార్యదర్శి తిప్పరపు సురేష్

 

 

కేంద్ర బడ్జెట్లో భారతదేశంలోని దళితులు నిరుత్సాహపడే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కే వి పి ఎస్ ) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ అన్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులలో దళితుల అభివృద్ధికి ఆమోదయోగ్యంగా లేదని మరింత అంతరాలను పెంచే విధంగా గణాంకాలు ఉన్నాయని అన్నారు. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు కేటాయింపుల తిరస్కరణ మోడీ పాలనలో కొనసాగుతూనే ఉందని అన్నారు. నిత్యం దళితుల పై దాడులు దౌర్జన్యాలు అఘాయిత్యాలు జరుగుతున్న ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం అమలు కోసం తగినంత నిధులను కేటాయింపులు లేవని అన్నారు. దళితుల ఉన్నత విద్యనాభ్యసించడంలో ఫీజుల పెంపు మరియు ఇతర అడ్డంకులను నిరసిస్తూ అనేక వర్గాల యువకుల తిరుగుబాటు ఉంది. కాబట్టి పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్లకు కేటాయింపులు బడ్జెట్లో పెంచకపోవడం నిరాశపరిచిందని అన్నారు. ఈ బడ్జెట్ మోడీ ప్రభుత్వం దళిత వ్యతిరేకత ను చూపిందని అన్నారు. దళితుల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment