అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలి 

అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలి 

 

– మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, 36వ వార్డు కౌన్సిలర్ గండూరి ప్రవల్లిక ప్రకాష్ అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన 36వ వార్డు సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అధికారులు ఉద్యమ పథకాలకు దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లను సభలో చదివి వినిపించారని అందులో పేర్లు రానివారు మరల దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత అధికారులు ప్రభుత్వంపై ఉందన్నారు. నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను వర్తింపజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ రావు, వార్డు అధికారులు సంతోష్ రెడ్డి, జీవన్, మల్లేష్, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ బూర సతీష్, నాయకులు మోత్కూరి సందీప్, రాచకొండ కృష్ణ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment