ప్రతి ఒక్కరూ టిబి నిర్దారణ పరిక్షలు చేయించుకోవాలి

ప్రతి ఒక్కరూ టిబి నిర్దారణ పరిక్షలు చేయించుకోవాలి

 

45 వ వార్డు మాజి కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్

 

 

ప్రతి ఒక్కరూ టిబి నిర్దారణ పరిక్షలు చేయించుకుని తమ ఆరోగ్యం పరిరక్షించుకోవాలని సూర్యాపేట 45 వ వార్డు మాజి కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ అన్నారు. మంగళవారం నాడు విద్యానగర్ లోని గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టిబి నిర్దారణ, బిపి, షుగర్ పరీక్షలను గండూరి పావని క్ర్రపాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 2016 లో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రములో టిబి వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశ్యంతో టిబి వ్యాధి పరిక్షలు, నివారణకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారని, దాని ఫలితంగా టిబి వ్యాధిని 75% వరకు అరికట్టడం జరిగిందని అన్నారు. నేడు కేంద్ర ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో టిబి నిర్దారణ పరీక్షలతో పాటు బిపి, సుగర్ పరిక్షలను ఉచితంగా చేసి, టిబి పాజిటివ్‌ వచ్చిన వారికి మూడు నెలల పాటు మందులు ఇస్తారని అన్నారు. టిబి వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించాలని లేకపోతే శరీరంలో వ్యాపించి జీర్ణవ్యవస్థ ను దెబ్బతీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్ర్రపాకర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, గుడిపూడి వెంకటేశ్వర రావు, బెజగంఫణి, మిట్టపల్లి రమేష్, బజ్జూరి శ్రీనివాస్, డాక్టర్ శివప్రసాద్, సూపర్వైజర్ ఏకస్వామి, సుష్మ ల్యాబ్ టెక్నషియన్, ఎస్ పిఎల్ఇ వెంకట్, ఆశా కార్యకర్తలు విజయ, మణెమ్మ, శ్రీలత, కుక్కడపు భిక్షం, సందీప్, కళ్యాణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment