అలరించిన ముగ్గుల పోటీలు.
పెద్ద శంకరంపేట్. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా పెద్ద శంకరంపేటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ముగ్గుల పోటీలు అందరిని అలరించాయి. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలు పాటించాలని కోరుతూ వివిధ రకాల ఆకృతులతో అందంగా ముగ్గులను వేశారు. ముగ్గులలో విద్యార్థులు వేసిన రంగులు తో పాటు ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటేశం. పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.