పేట మున్నూరు కాపు సంఘం మండల నూతన కార్యవర్గం ఎన్నిక.
పెద్ద శంకరంపేట్. పెద్ద శంకరంపేట మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం పెద్ద శంకరంపేట లో ఎన్నుకున్నారు. మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులుగా బుగుడాల సాయిలు పటేల్ ఉపాధ్యక్షులుగా గంగన్న గారి సుభాష్ పటేల్.కార్యదర్శిగా రాధాకృష్ణ పటేల్. కోశాధికారిగా రాయిని రాములు పటేల్. సంయుక్త కార్యదర్శిగా ఎల్లయ్య.. పలువురిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఆయా గ్రామాల మున్నూరు కాపు సంఘం బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.