నూతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఎన్నిక

నూతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఎన్నిక

 

పెంట్లవెల్లి ఎమ్మార్పీఎస్ మండల కమిటీ నాయకులు

 

 

పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ మండల ఇన్చార్జి సులిగిరి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించి నాయకులను ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ మాదిగn ఎమ్మార్పీఎస్ తో మాదిగలకు న్యాయం జరగడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. లక్ష డప్పులు వేల గొంతులు భారీ బహిరంగ సభకు మండలంలోని ప్రతి మాదిగ మరియు ప్రతి ఒక్కరూ డబ్బుతో కదలి రావాలని వారు పిలుపునిచ్చారు. కమిటీ ఎన్నికలో మండల అధ్యక్షుడు గా బంకలి కురుమూర్తి మాదిగ వైస్ ప్రెసిడెంట్ బత్తిని రాము మాదిగ మండల కార్యదర్శిగా కేశ పోగుల శేఖర్ మాదిగ ప్రధాన కార్యదర్శి గా ఏదుల వెంకటేష్ మాదిగ కోశాధికారిగా బత్తిని వెంకటేష్ మాదిగ వీరపోగు కురుమయ్య మాదిగ మీసాల బాలరాజు కార్యవర్గ సభ్యులు సులిగిరి భాను మాదిగ, బత్తిని శివకుమార్ మాదిగ ఎన్నుకోబడ్డారు కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సంపంగి మద్దిలేటి ఏదుల రాముడు వడ్డే మాన్ రాముడు బత్తిని పరమేష్ బత్తిని బాలరాజ్ బంకల బాలస్వామి ఎంఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి రమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment