ఆరుబయట ఆహారం తిని ఐదుగురు విద్యార్ధినీలకు అస్వస్థత
తక్షణమే స్పందించి మెగుగైన చికిత్స
విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా
ఆరోగ్యం మెరుగవడంతో తిరిగి హాస్టల్ కు విద్యార్థినులు
ఆరు బయట ఆహారం తిని అస్వస్థతకు గురైన ఐదుగురి విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు..సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరి నగర్ గిరిజన బాలికల వసతి గృహంలో ఐదుగురు విద్యార్ధినీలకు అస్వస్థతకు గురయ్యారు. బయట కొనుగోలు చేసిన సమోసాలు తిన్న విద్యార్ధినీలే అస్వస్థతకు గురైనట్లు ఆధికారులు గుర్తించగా విద్యార్దినిలు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోవడంతో గమనించిన ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్ కు సమాచారం ఇచ్చి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో తిరిగి వసతి గృహాలకు పంపించినట్లు తెలిపారు..హాస్టల్ ఆహారం తినడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు..