ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి
రామగిరి మండలం కల్వచర్ల గ్రామం లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నుండి 3వ, 4వ, 5వ తరగతుల విద్యార్థిని, విద్యార్థులు ట్రాఫిక్ నియమ నిబంధనలు గురించి కమాన్ పూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బైక్ పై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని, కారు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ తప్పని సరిగా వాడాలని, రోడ్డు పై వెళ్ళే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి స్థానిక పోలీస్ వారికి సహకరించాలని విద్యార్థిని, విద్యార్థులు పాటల ద్వారా, నృత్యాల ద్వారా తెలియ జేశారు. ఈ కార్యక్రమం నకు 5వ తరగతి చెందిన రిశ్విక్ అనే అబ్బాయి యమ ధర్మరాజు వేషం లో ఆకట్టుకున్నాడు. హెల్మెట్ లేకుండా వచ్చు ప్రయాణికులను యమ ధర్మరాజు “నిన్ను నరకానికి తీసుకెళ్తా మానవ” అనే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి కమాన్ పూర్ ఎస్ ఐ కొట్టె ప్రసాద్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలను కృష్ణవేణి విద్యార్థులు చాలా బాగా వివరించారని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయుటలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ముందు వరుసలో వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు బర్ల శ్రీనివాస్, కమాన్ పూర్ పి ఎస్ ఐ రవళి, డైరెక్టర్లు అనిల్ కుమార్ రెడ్డి, రంజిత్ రెడ్డి మరియు ఉపాధ్యాయిని ఉపాద్యాయులు పాల్గొన్నారు.