అధైర్యపడకండి అండగా ఉంటాం 

అధైర్యపడకండి అండగా ఉంటాం 

 

 సిద్ధిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల రేకుల ఇల్లు దగ్ధం

 

బాధితులను పరామర్శించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అత్తు ఇమామ్

 

బాధితులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత 

 

అర్బన్ మండలం ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని వినతి 

 

దాతలు ముందుకు వచ్చి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి

 

సిద్ధిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్ కలిగి రేకుల ఇల్లు దగ్ధం అవడంతో కుటుంబం రోడ్డున పడ్డారని వారికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేట అర్బన్ మండలంలో బాకీ బిక్షపతి లక్ష్మీ శ్రీనివాస్ లకు చెందిన చిన్నపాటి రేకుల ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైందని అన్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు సిద్దిపేట అర్బన్ మండల తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లినట్లు త్వరలోనే ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయాన్ని త్వరగా వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని అతిపెద్ద కుటుంబం బాకీ బిక్షపతి లక్ష్మీలది అని ఆ కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి మరింత ఆర్థిక సహాయం అందించేందుకు చొరవ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నంగునూరు మండల అధ్యక్షులు తప్పెట శంకర్ సిద్దిపేట యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ నజ్జు ఫయాజుద్దీన్ మిట్టపల్లి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment