మాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ, పోలీస్ సిబ్బంది.  

మాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ, పోలీస్ సిబ్బంది.

 

 అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి.గురువారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి , జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్ , పోలీస్ అధికారులు, సిబ్బంది మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల అమరవీరులు త్యాగాలను స్మరిస్తూ వారి ఆత్మశాంతి గురించి తేదీ 30-01-2025 ఉదయం 11:00 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో, అలాగే జిల్లా పోలీస్ స్టేషన్ల లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… సత్యం, అహింస సిద్ధాంతాలు అనే శాంతి మంత్రంతో దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన మహాత్మాగాంధీ ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ఆయుధం లేకుండా పోరాటం చేసిన సమరయోధుడు గాంధీ అని కొనియాడారు. నేటి మన ఈ స్వతంత్రం మహా వీరుల అసమాన త్యాగఫలం అని దేశ స్వతంత్రం కొరకు త్యాగాలు చేసిన ఎందరో అమర వీరులకు మనమెల్ల వేళలా ఋణపడి ఉండాలని, ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవాదృక్పథమూ మన జీవితంలో ప్రధానాంశాలుగా కావాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్,ఏ.ఆర్.డి.ఎస్.పి.రంగా నాయక్,ఎస్.బి.సి.ఐ.సందీప్ రెడ్డి,డి.సి.ఆర్.బి.సి.ఐ.మధుసూదన్ గౌడ్ ,అడ్మిన్ ఆర్.ఐ.శైలేందర్ , డిపిఓ సిబ్బంది,పోలీస్అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment