క్రీడాకారులకు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా ఎస్పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి
శనివారం జిల్లా ఎస్పి కార్యాలయంలో పథకాలు సాదించిన క్రీడాకారులకు ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన మూడవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడల్లో మెదక్ జిల్లా పోలీసులు రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో మెదక్ జిల్లా పోలీసులు ఏకంగా 8 పతకాలను సాధించారు. ఇందులో 1 బంగారు పతకంతో పాటు 2 రజితలు, 5 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. కానిస్టేబుల్ రాజశేకర్ టేబల్ టెన్నిస్ డబుల్స్ లో బంగారు పథకం మరియు సింగిల్స్ లో కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు. మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్ బ్యాట్మెంటన్ విభాగంలో ఒక రజిత పథకం మరియు ఒక కాంస్య పథకం గెలుపొందారు, కానిస్టేబుల్ రమేష్ లాంగ్ టెన్నిస్ డబుల్స్ విబాగంలో రజిత పతకం మరియు సింగిల్స్ విబాగంలో కాంస్య పథకం గెలుపొందారు అదేవిధంగా రెజ్లింగ్ 70 కేజిల విభాగం లో కాంస్య పథకాన్ని సాధించారు, కానిస్టేబుల్ సంగ్రామ్ రెజ్లింగ్ 72 కేజిల విభాగంలో కాంస్య పథకాన్ని గెలుపొందారు. ఈదేవిదంగా జాతీయ స్థాయి పోటీలో కూడా మంచి ప్రతిభను కనభరిచి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పేరును మార్మోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆధానపు ఎస్పి మహేందర్ మరియు జిల్లా సాయుద దళ డిఎస్పి రంగనాయక్ మరియు ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి మరియు ఆర్ఐ శైలేందర్ మరియు ఆర్ఎస్ఐ నరేష్ క్రీడాకారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.