భవిష్యత్ తరాలకు ఆదర్శవంతులుగా నిలవండి జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎస్ చలపతి రాజు
దుమ్ముగూడెం : నేటి విద్యార్థులు రేపటి భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా నిలవాలని జిల్లాసైన్స్ అధికారి ఎస్ చలపతి రాజు కోరారు గురువారం దుమ్ముగూడెం లో గత మూడు రోజులుగా నిర్వహించిన నేచర్ క్యాంప్ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని పరిశీలించడం ద్వారా అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని, ప్రకృతిని అవగాహన చేసుకుని ఎలాంటి ఆటంకము కలగకుండా ప్రస్తుతం ఉన్న ప్రకృతిని తరతరాలుగా అందించాలని ఆయన కోరారు తాము నేర్చుకున్న విషయాలు పాఠశాలలకు వెళ్లి మిగిలిన విద్యార్థులకు కూడా ప్రకృతి పట్ల అవగాహన కలిగించాలని సూచించారు గత మూడు రోజులుగా దుమ్ముగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు, హైడర్ ప్రాజెక్ట్, గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి జలాలు తదితర అంశాలపై అవగాహన కలిగించారు. ముఖ్యంగా మొక్కలు ఏ విధంగా నాటాలి, ఏ విధంగా సంరక్షించాలి అనే అంశంపై ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఎన్జీసి రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఎం రాజశేఖర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శోభారాణి గైడ్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.