జిల్లా పోలీస్ కార్యాలయం,

జిల్లా పోలీస్ కార్యాలయం,

 

*• సైబర్ నేరాల గురించి అవగాన కలిగి అప్రమత్తంగా ఉండండి..* 

*• అపరిచిత ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ చేసి, పోలీసు అధికారులం అంటే నమ్మరాదు.*  

*• ట్రాఫిక్ రూల్స్ పాటించి, రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందండి.* 

*• సైబర్ క్రైమ్స్, మాదకద్రవ్యాల నిర్మూలన మరియు ట్రాఫిక్ రూల్స్ పై అమీన్ పూర్ పట్టణ యువతకు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థి, విద్యార్థులకు అవగాహణ కార్యక్రమం.*       

*• పటాన్ చెర్వు సబ్-డివిజన్ పోలీసుల ఆద్వర్యంలో బాలాజీ ఫంక్షన్ హాల్ అమీన్ పూర్ నందు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రంలో విద్యార్థిని, విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్. * 

 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదురుకుంటున్న సమస్య, సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ముఖ్యం అన్నారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో పడవద్దని అన్నారు. జిల్లాలో సైబర్ నేరాలు అధికంగా అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటున్నాయని, సైబర్ నేరాలకు గురిఅవుతున్న వారిలో విద్యావంతులే అధికం అన్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, వంటి ఆన్లైన్ మోసాల పట్ల అవగాహ కలిగి ఉండాలని, మొదట డబ్బులు వస్తున్నట్లు ఆశ చూపించి, ఆతర్వాత ఆన్లైన్ మోసాలకు పాల్పడతారని గుర్తించాలన్నారు. ఏ పోలీసు అధికారి నేరుగా వాట్స్ ఆప్ వీడియో కాల్స్ చేయరాని, డిజిటల్ అరెస్ట్ అని చేసే కాల్స్ ను నమ్మరాదని అన్నారు. అనుమానిత ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ వస్తే సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం అందించాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ నందు రిపోర్ట్ చేయాలని సూచించారు. అమాయక ప్రజల బాలహీనతే, సైబర్ నేరాగాళ్ల బలంగా.. వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో టెక్నాలజీని వాడుకొని మరిన్ని సైబర్ మోసాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. కావున ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ నేరాల నుండి బయటపడవచ్చని, ఇంటి వద్ద పెద్దవారికి కూడా ఈ సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయినట్లైతే వెంటనే (గోల్డెన్ అవర్)/48 గంటలలోపు 1930 కు కాల్ చేసి గాని, యన్.సి.ఆర్.బి. (https://www.cybercrime.gov.in) పోర్టల్ నందు కాంప్లయింట్ నమోదు చేయాలని సూచించారు.

 

మాదకద్రవ్యాలు దుర్వినియోగం గురించి మాట్లాడుతూ.. డ్రగ్ మహమ్మారి బారినపడి యువత జీవితాలను పాడు చేసుకుంటున్నారని, మాదకద్రవ్యాలను వినియోగించడం మన దేశంలో నిషేదించడం జరిగిందని గుర్తించాలన్నారు. మొదట చిన్న,చిన్న సరదాలు పోయి అదికాస్త వ్యాసనంగా మారే అవకాశం ఉందని, మాదకద్రవ్యాల వినియోగంలో జీవితాలు చిత్తు అవుతాయని గుర్తించాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, అమ్మకం మరియు సేవించిన వారి పై చట్ట రిత్య కఠిన చర్యలు జరుగుతుందని, మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు తెలిసినట్లైతే అట్టి వారిపై కేసు నమోదు చేసి, విద్యాసంస్థల నుండి టర్మినేట్ చేయించడం జరుగుతుందన్నారు. డ్రగ్ ఫ్రీ జిల్లా గా మార్చడంలో జిల్లా పోలీసులకు సహకరించాలని విద్యార్థిని, విద్యార్థులు సూచించారు. 

 

*ట్రాఫిక్ రూల్స్:* ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని, మోటర్ సైకిల్ నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్, కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. మైనర్ లకు వాహనాలకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఆలోచన చేయాలని, మైనర్లు వాహనాల నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, వాహనాలు నడుపుతూ ఫోన్ మాట్లాడరాదని, పరిమిత వేగంలో నడపాలని సూచించారు. మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉంటారని గుర్తు చేస్తూ, వారి ఆశయాలను వమ్ముచేయకుండా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు. 

 

ఈ కార్యక్రమంలో పటాన్ చెర్వు డియస్పి రవీందర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డియస్పి వేణుగోపాల్ రెడ్డి, అమీన్ పూర్ ఇన్స్పెక్టర్ పి. నరేష్, బొల్లారం ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలూ నాయక్ వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు, అమీన్ పూర్ పట్టణ యువత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version