కార్మికులు ఐకమత్యంతో పనిచేయాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు
సిఐటియు అనుబంధ సంఘం సూర్యాపేట జిల్లా బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికలలో జిల్లా అధ్యక్షులు గా కనుకు మార్క్స్, ప్రధాన కార్యదర్శి గా మొండికత్తి లింగయ్య, ఉపాధ్యక్షులు గా శతకోటి వెంకన్న, కోశాధికారి గా కొత్తపల్లి శివ కృష్ణ,పెన్ పహాడ్ మండల అధ్యక్షులు ఎర్కచర్ల అభిరాం ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులు గా నెమ్మది వెంకటేశ్వర్లు ను ఎన్నుకున్నారు. గురువారం నాడు సూర్యాపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయం నందు జరిగిన ఎన్నికలలో పెద్దసంఖ్యలో బిల్డింగ్ పెయింటర్స్ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో 29 రంగాలలో కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయని, కార్మికుల సమస్యలపై సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. నూతనంగా ఎన్నికైన బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ ద్వారా ప్రతి గ్రామంలో, మండలంలో, పట్టణాలలో కమిటీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అసోసియేషన్ క్రమశిక్షణతో ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేయాలని, ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్డింగ్ పెయింటర్స్ కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అన్నారు. కార్మికులకు ప్రభుత్వం బైక్ లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఎవరైనా చనిపోయిన సమయంలో యూనియన్ వారికి అండగా నిలవాలని, వారి కుటుంబానికి ఆర్దిక సహాయం చేసి ఆదుకోవాలని అన్నారు.