ప్రజల కోసం పని చేయండి- లేదా సస్పెండ్ చేయక తప్పదు.మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్.
-ప్రజల సమస్య తో వస్తే వెంటనే స్పందిచి పరిష్కారం చేయండి.
మహబూబాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
ప్రతినెల సంబంధిత అధికారులు రివ్యూ మీటింగ్ లో పాల్గొనాల్సిందేనని రివ్యూ మీటింగ్ లో పాల్గొనని అధికారులపై తక్షణమే చర్యలు ఉంటాయని మండల అధికారుల మొదలగు గ్రామస్థాయి సెక్రటరీ వరకు రివ్యూ మీటింగ్ లో పాల్గొనాల్సిందే.పాయింట్ టు పాయింట్ చెప్పాల్సిందే.మండల కేంద్రంలో ఉన్న ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య,కొరత ఉండకూడదు.వైద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు, నియోజకవర్గంలో విష జ్వరాలు వజ్రంభిస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు, తక్షణమే వైద్యులు వారి యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి.రెవెన్యూ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.విద్యుత్ అధికారులు నిత్యం రైతుల విషయంలో విద్యుత్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఏ ఒక్క అధికారికైనా సరే ప్రజలు ఫోన్ చేస్తే తక్షణమే స్పందించాలన్నారు ఫోను స్పందించని యెడల ఆ యొక్క బాధితులు నా దగ్గరికి వస్తే మాత్రం అధికారుల పైన కోరాడ జులిపిస్తానన్నారు, కఠిన చర్యలు వెంటనే తీసుకుంటానన్నారు.అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే మాత్రం సహించబోనని గట్టిగా హెచ్చరించారు.ఏ ఒక్క అధికారి అయినా సరే విధులకు రాకుండా కిందిస్థాయి అధికారులకు ఫోన్ చేసి పనూలు చేపిస్తానంటే ఆయా అధికారులను శాశ్వతంగా ఇంట్లోనే కూర్చోబెడతానన్నారు.ప్రతి ఒక్క అధికారి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్నారు.మండల కేంద్రం నుండి ప్రజలు నా దగ్గరికి వచ్చి ఒక్క కంప్లీట్ చేసినా సరే ఇకపైనుండే ఉపేక్షించేదే ఉండబోతున్నారు.మీయొక్క పనిని మీరు సక్రమంగా పాటించాలన్నారు.ఈ నాలుగున్నర సంవత్సరాలు ప్రతి ఒక్క అధికారిని నిత్యం పర్యవేక్షిస్తూనే ఉంటానన్నారు.అధికారులకు ఎలాంటి సమస్యలు ఉన్న తక్షణమే నన్ను స్పందించాలని వారి యొక్క సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతానన్నారు.అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం వారు అయా అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.మంగళవారం మహబూబాబాద్ మండల కేంద్రంలో అధికారుల జనరల్ బాడీ రివ్యూ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్.ఈ కార్యక్రమం అనంతరం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు ఏ సమస్య పైన అయినా సరే ఫోన్ చేస్తే వెంటనే స్పందించాలని ఆ యొక్క పనిని వెంటనే జరిగేలా చొరువచూపాలని అధికారులకు హెచ్చరించారు ప్రజల కు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అధికారులను వెంటనే స్పందించాలన్నారు లేని యెడల ఉపేక్షించేది లేదని వారిపైన కచ్చితంగా చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు ప్రభుత్వం చేపడుతున్న ప్రజా కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా అహర్నిశల అధికారులు కృషిచేసి పని చేయాలన్నారు లేనిచో వారిపైన కఠిన చర్యలు ఉంటాయని కచ్చితంగా అధికారులు ప్రజల పక్షాన నిత్యం పనిచేయాలన్నారు వారి నుండి ఎలాంటి కంప్లైంట్స్ నా దగ్గరికి రాకుండా అధికారులు సక్రమంగా పనిచేయాలన్నారు…ఈ యొక్క కార్యక్రమానికి గాను మండల ప్రభుత్వ ఉద్యోగులు గ్రామపంచాయతీ సిబ్బంది పోలీసు వారు ఇలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు జిల్లా నాయకులు మండల ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు యూత్ అధ్యక్షులు నాయకులు , మాజీ సర్పంచ్లు జెడ్పిటిసి లు ఎంపిటిసి లు, మార్కెట్ ప్రస్తుత చైర్మన్లు మాజీ చైర్మన్లు గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….