ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడీగా పోటీ చేస్తున్న చెరుకుపల్లి నరేందర్ ని గెలిపించండి.
-యువతకు విద్య,ఉపాధి అవకాశాల కృషి చేస్తా.
-చెరుకుపల్లి నరేందర్
భారత జాతీయ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్ఫూర్తితో నేటి యువత పార్టీ కి ప్రాతినిథ్యం వహిస్తూ, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఇల్లందు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా,అనుక్షణం పార్టీ సంస్థాగత నిర్మాణం కొరకు,పార్టీ బలోపేతానికి, అంకితభావంతో పనిచేస్తూ,యువతలో ఎప్పటికప్పుడు చైతన్యాన్ని కలిగించి యువ నాయకుడిగా ఎగుగుతున్న చెరుకుపల్లి నరేందర్ నీ గెలిపిద్దాం.పార్టీ పట్ల యువత పట్ల సమగ్ర బాధ్యత,సమగ్ర విశ్లేషణ కలిగిన వ్యక్తికి అండగా ఉందాం.యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిపించుకుందాం.దళిత కుటుంబంలో పుట్టి నియోజకవర్గంలో అందరికి నోటిలో నాలుకల మెదులుతూ అందరి కష్టాలు తన కష్టాలుగా భావించి అందరికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలిసినవాడు,నాయకత్వ లక్షణాలు కలిగినవాడు,ప్రజా సమస్యల పరిష్కారానికై నిరంతరం శ్రమించేవాడు.పార్టీ లో కార్యకర్తలను ప్రేరేపిస్తూ వారికి వారి లక్ష్యాలను గుర్తు చేస్తూ అందరికీ ఆదర్శంగా,సమాజం పట్ల,బాధ్యత కలిగిన చెరుకుపల్లి నరేందర్ కు అండగా నిలుద్దాం.
ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షా అభ్యర్థిగా కార్యకర్తలు,యువత భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ వారిని కాపాడుకునే ప్రయత్నం చేసే,మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి స్నేహశీలి..రాష్ట్ర స్థాయిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధాలు వున్న వ్యక్తి చెరుకుపల్లి నరేందర్ నీ ఇల్లందు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నుకోవాలని యువకులు బలంగా కోరుకుంటున్నారు.నియోజకవ ర్గంలో యూత్ కాంగ్రెస్ లో కార్యకర్తల కష్ట సుఖాలలో పాలుపంచుకునే వ్యక్తి. యువతకు ఉపాధి,ఉద్యోగాల విషయంలో చెదోడు వాడోడుగా వుంటూ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ కి వెన్ను ధన్నుగా నిలిచి పార్టీ కోసం పని చేసే దుమ్మున్న వ్యక్తి చెరుకుపల్లి నరేందర్ నే మన ఇల్లందు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడుగా ఎన్నుకుందాం.