బతుకమ్మతో ఆమె బరిలోకి దిగుతారా..?
అభిమానులు ఏం చెబుతున్నారంటే..
ప్రతి ఏటా కవిత తెలంగాణ జాగృతి పేరిట బతుకమ్మ ఉత్సవాలను జరుపుతుంటారు. ఈ పండుగ వచ్చిందంటే ఎమ్మెల్సీ చేసే హడావుడి ఎవ్వరూ చెయ్య లేరు కూడా.. అయితే ఈ సారి కూడా కవిత బతుకమ్మ ఉత్సవాల్లో హాజరవుతారా..? లేదా అనేది ఉత్కంఠగా ఉంది.. ఒకవేళ ఆమె ఉత్సవాల్లో పాల్గొంటే అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు.. బిజేపీ నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశముందని పార్టీ క్యాడర్ భావిస్తోంది.. కానీ బీఆర్ ఎస్ అగ్రనేతలు మాత్రం కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని చెబుతున్నారు.. వీటన్నింటికి పుల్ స్టాప్ పడాలంటే మరో పదిరోజులు ఆగాల్సిందే..