ఈ నెల 5నుంచి మోగనున్న పెళ్లిబాజాలు
ఆషాఢమాసం ముగిసి శ్రావణమాసం రానున్న తరుణంలో ఈ నెల 5 నుంచి పెళ్లిబాజాలు మోగనున్నాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత పెళ్లిళ్ల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కళ్యాణ మండపాలను సిద్ధం చేస్తున్నారు.ఈ నెల 5 నుంచి 31 వరకు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో ముహూర్తాలు లేవని, మళ్లీ అశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసంలో ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.