వాలీబాల్ టోర్నమెంట్
క్రీడాకారులు ఈ అవకాశం సద్వినియొగం చేసుకోవాలి
చార్మినార్ ఎక్స్ ప్రెస్ రేగోడ్ మండలం, జనవరి 11:- రేగోడ్ మండలంలోని లింగంపల్లి లో మాజీ సర్పంచ్ బగిలి హన్నప్ప స్మారక వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు బగిలి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు, ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశం సద్వినియొగం చేసుకోవాలని, మొదటి ప్రైజ్ 20,111 రెండవ బహుమతి 10,111 ఉన్నట్లు తెలిపారు. డ్రా 12 వ తేదీ నాడు తిబడునని పేర్కొన్నారు.