మట్టివినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ
*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 06*
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికి, కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు ,కాంగ్రెస్ పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు, వార్డ్ మెంబర్లకు, ఏరియా కమిటీ ప్రతినిధులకు,ఉద్యమకారులకు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు ,పార్టీ శ్రేయభిలాషులకు ,పాత్రికేయ మిత్రులకు, అధికారులకు ,అనాధికారులకు ,మిత్రులకు ఆత్మీయులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు వినాయకుడు. అని అందుకే ఆయన్ను విఘ్నేశ్వరుడు అంటారు అని ఎంతోమంది దేవుళ్లు ఉన్నప్పటికీ మొదట పూజలు అందుకునేది ఆయనే కాబట్టి ఆదిదేవుడుగా కొలుస్తారు అని ఏనుగు తల, మనిషి శరీరం కలిగి ఉండి ఒకే దంతం కలిగి ఉండటంచేత ఏకదంతుడుగా కీర్తించబడుతున్నాడు అని దేవగణాలకు అధిపతి కాబట్టి గణపతిగా పూజలు అందుకుంటున్నాడు అని సకల లోకాల సర్వ జనులకు శుభాలు కలిగించే ఆ బొజ్జ గణపయ్య పండుగ వినాయక చవితిని అందరూ ఘనంగా జరుపుకుంటారు.అని ఎమ్మెల్యే గాంధీ తెలియజేసారు.పండుగ ను చక్కటి వాతావరణం లోకుటంబ సభ్యుల మధ్య ఆనందాయకంగా ,సంతోషకరంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగినది .అదేవిదంగా వినాయక చవితి పండుగ ను ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని రకాల వసతులు కలిపించాలని ,పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించడం జరిగినది .ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి వాతావరణం లో జరుపుకునేందుకు వీలుగా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు
మట్టి వినాయకులను పూజించి మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకుందాం మరియు చెరువులను కలుషితం చేయకుండా వీలైనంత వరుకు మట్టి వినాయకులను మన యొక్క స్వగృహం ప్రాంగణంలో నే నిమర్జనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని , అదేవిధంగా పర్యావరణ హితం మట్టి గణపతులను పూజించాలని ఈ విషయంలో మహిళలు ముందుండాలని, ప్రతి ఒక్కరికి అవగహన కలిపించాలని, మట్టి వినాయకులను పూజించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అదేవిధంగా భవిష్యత్ తరాల ను దృష్టిలో పెట్టుకొని సమాజ హితం పర్యవరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ హితం ప్రతి ఓక్కరు మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాల ద్వారా చెరువులు కలుషితం అవుతాయి అని ,పర్యావరణ సమతుల్య త దెబ్బ తింటుంది అని కావున భావితరాలను దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పూజించి పర్యావరణంను పరిరక్షించాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.