వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలి.

 

పెద్ద శంకరంపేట ఎస్సై శంకర్.

 

చార్మినార్ ఎక్స్ ప్రెస్: సెప్టెంబర్ 4, పెద్ద శంకరంపేట్.

మండల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్ఐ శంకర్ సూచించారు. బుధవారం పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకే నెలలో రెండు పండుగలు వస్తున్నాయని ముస్లింలు మిలాద్ ఉన్ నబి , హిందువులకు గణేష్ పండుగ ఉన్నందున కులమతాలకు అతీతంగా ఈ రెండు పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి తప్పక తీసుకోవాలన్నారు. 9 లేదా 11 రోజుల లో వినాయక నిమజ్జనం ఏర్పాటు చేసుకోనీ పోలీసుల కు సహకరించాలన్నారు. మండపాలు రోడ్డు మీద ఏర్పాటు చేయకూడదు అన్నారు.గణేష్ మండపాల సమాచారాన్ని సంబంధిత పోలీసు అధికారులకు తప్పకుండా తెలియజేయాలన్నారు. ప్రతి మండపం వద్ద పాయింట్స్ బుక్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు తరచు తనిఖీలు చేస్తారని డి జే లకు అనుమతి లేదని అన్నారు.మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మండప నిర్వాహకులదే పూర్తి బాధ్యత వహించాలన్నారు. వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు పూర్తి బాధ్యతలు నిర్వాహకులు తీసుకోవాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment