గంజాయి,మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచార ఉద్యమం తీవ్రం చేస్తాం:బొమ్మగాని వినయ్ గౌడ్
విద్యార్థులు, యువత భవిష్యత్తును
నిర్వీర్యం చేస్తున్నటువంటి గంజాయి,ఇతర అన్ని రకాల మత్తుకు బానిసలు కావొద్దు అంటూ తెలంగాణ విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ప్రచార ఉద్యమం చేయనున్నట్లు విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్. తెలిపారు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విద్యార్థి జన సమితి నాయకులతో కలిసి ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ సూర్యాపేట ప్రాంతంలో గంజాయి ప్రభావానికి అలవాటుకు బానిసలు అవుతున్నట్లుగా పలు ఘటనలు వె లుగులోకి వచ్చాయి కావున బాధ్యతగల విద్యార్థి సంఘం నాయకులు గా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జును గారి ఆదేశం మేరకు పట్టణ కేంద్రంలోని అన్ని విద్యాసంస్థల్లో మరియు గ్రామీణ ప్రాంత యువకులలో గంజాయి వ్యతిరేక చైతన్యను తీసుకురావడం కొరకు కరపత్రాలు సదస్సులు సమావేశాల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆగస్టు 6 జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని ఆ రోజు నుంచి ప్రారంభించి 100 రోజుల ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు వినయ్ గౌడ్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి జన సమితి నాయకులు శీలం గౌతం, వంశీ, రాజేష్, ప్రభాస్ ఉప్పి రాజు, ప్రభాస్,మహేష్,ఉమేష్, నవీన్ సంతోష్ సతీష్,అర్జున్ తదితరులు పాల్గొన్నారు