దిశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వానమహోత్సవం

దిశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వానమహోత్సవం

భద్రాచలం దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏఎంసీ కాలనీలో వనమోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మీ మాట్లాడుతూ దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు బివి రాజు ఉపాధ్యక్షురాలు కళ్యాణి ల ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా వనమోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మొక్కలను నాటడం వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. మొక్కలను నరకటం వల్ల వాతావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలను విధిగా పెంచి ప్రకృతిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో దిశ కుటుంబ సభ్యులు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment