కోటి పన్నెండు లక్షలతో సిసి రోడ్ల పనులకు ఏమెల్యే గాంధీ తో కలసి శంకుస్థాపన చేసిన ఉప్పలపాటి శ్రీకాంత్
శేరిలింగంపల్లి నియోజకవర్గం
మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్, హెచ్ ఎం టి స్వర్ణపూరి కాలనీ ,కృషి నగర్ కాలనీ లో రూ.1.12.00 ఒక్క కోటి పన్నెండు లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు పిఏసి చైర్మన్ ఆరెక పూడి గాంధీ మియాపూర్ డివిజన్ నాయకులతో కలిసి పాల్గొని శంకుస్థాపన చేసిన మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ అభివృద్దే ధ్యేయంగా మియాపూర్ డివిజన్లో 1.12 ఒక్క కోటి పన్నెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, వివిధ కాలనీల వాసులకు ఉపశమనం లభించింది అని, కాలనీల మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని, సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో మియాపూర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత , సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు