స్కాలర్షిప్ కోసం ఆధార్ లో పేరు అప్డేట్ చేసుకోండి

స్కాలర్షిప్ కోసం ఆధార్ లో పేరు అప్డేట్ చేసుకోండి

– టెన్త్ మెమోలో ఉన్న ప్రకారం నమోదు చేసుకోవాలి

– బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు గమనించాలి

– ఈనెల 16వ తేదీ వరకు అవకాశం

– ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ సూచన

 

 బెల్లంపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో చదువుతున్న డిగ్రీ మరియు పీజీ విద్యార్థులు మీయొక్క పదవ తరగతి మెమోలో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో అదే విధంగా ఆధార్ కార్డులో పేరు మార్చుకొని మొబైల్ నెంబర్ను మరియు వేలిముద్రను అప్డేట్ చేసుకొని ఈనెల 16వ తేదీలోగా స్కాలర్షిప్ అప్లై మరియు రెన్యువల్ చేసుకోగలరని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, స్కాలర్షిప్ ఇంచార్జ్ మహమ్మద్ రఫీ తెలిపారు. పదవ తరగతి మెమోలో ఉన్న విధంగా పేరు ఆధార్ కార్డులో కూడా ఉండాలని, లేనట్లయితే స్కాలర్షిప్ ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి విద్యార్థులంతా పదో తరగతి మెమోలో పేరు ఉన్న విధంగా ఆధార్ కార్డులో కూడా అప్డేట్ చేయించుకుని తద్వారా ఈనెల 16వ తేదీలోగా స్కాలర్షిప్ అప్లై మరియు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలోని స్కాలర్షిప్ నోడల్ ఆఫీసర్ కిష్టయ్య గారిని ఈ క్రింది ఫోన్ నెంబర్ 97018 67606లో సంప్రదించగలరని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment