యూజీసీ మార్గదర్శకాలను రద్దు చేయాలి….. SFI
–యుజిసి మార్గదర్శకాలు ఫెడరలి
జానికి ముప్పు
–యూనివర్సిటీల స్వయం ప్రతిప
త్తిని కాపాడుకుందాం
— ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన
అజయ్ కుమార్
SFI మెదక్ జిల్లా కార్యదర్శి
గురువారం విద్యార్థులతో నిరసన తెలుపుతూ ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకువచ్చిన డ్రాఫ్ట్ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో ఉపాధ్యాయులు మరియు అకడమిక్ సిబ్బంది నియామకం మరియు ప్రమోషన్ కోసం కనీస అర్హతలు మరియు ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణ కోసం చర్యలు) నిబంధనలు, 2025 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్. అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంలో ఉన్న పలు రాష్ట్రాల్లో గవర్నర్లతో విశ్వవిద్యాలయాల నిర్వహణ వారి జోక్యం ఇబ్బందికరంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కాలరస్తు కేంద్ర ప్రభుత్వం ఏకధాటిగా అధికారాల కేంద్రీకరణకై తీసుకువచ్చిన ఈ ముసాయిదా ఫెడరలిజాన్ని దెబ్బతీస్తుందని అలాగే కొత్త ముసాయిదా నిబంధనలు మొదటిసారిగా పరిశ్రమ నిపుణులు మరియు ప్రభుత్వ రంగ అనుభవజ్ఞులను పాత్ర కోసం పరిగణించటానికి అనుమతిస్తున్నాయని ఇది విద్యావేత్తలను ప్రత్యేకంగా నియమించే దీర్ఘకాల అభ్యాసం నుండి వైదొలిగినట్లు సూచిస్తుంది మరియు విద్యా రంగంలో కార్పొరేట్ సంస్కృతిని పరిచయం చేస్తుంది. ఇది కోర్ డిసిప్లిన్‌లో స్పెషలైజేషన్‌ను తొలగించడం ద్వారా అధ్యాపకుల నాణ్యతను భారీగా తగ్గించడం మరియు రిక్రూట్‌మెంట్ స్వభావంలో ఆత్మాశ్రయమైన ఎంపిక కమిటీకి 100% వెయిటేజీని ఇస్తుంది మరియు అకడమిక్ అర్హత, పరిశోధన ప్రచురణలు మరియు బోధనా అనుభవానికి ఎటువంటి క్రెడిట్ ఇవ్వదు. . ఇది అత్యాధునిక పరిశోధన నుండి ఇప్పటికే ఉన్న జ్ఞానాన్ని పునరుద్ఘాటించడం వైపు దృష్టిని మార్చడాన్ని కూడా చూపుతుంది అసోసియేట్ ప్రొఫెసర్ మరియు వైస్ ఛాన్సలర్ నియామకాల పట్ల పారదర్శక లేకుండా కేవలం యూజీసీ కనుసనల్లో సాగే కమిషన్లు సెర్చ్ కమిటీలు ఏమాత్రం పారదర్శకతను ప్రదర్శించలేని విధంగా ఉన్నాయని అట్లాంటి ఈ యుజిసి నిబంధనల ముసాయిదాను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్ అజయ్ విద్యార్థులు రాజు నవీన్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.