టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలిమరణించిన వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేసియా చెల్లించి టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వాలి బీఎస్పీ నారాయణ పేట జిల్లా బొదిగెలి శ్రీనివాస్
తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.గురువారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దైవ దర్శనానికి వెళ్తే కనీస భద్రత కల్పించకుండా భక్తుల ప్రాణాలు తీస్తారా? అంటూ ప్రశ్నించారు.టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతోనే స్వామి వారి భక్తులు మరణించారని,దీనికి టీటీడీ చైర్మన్ గారే పూర్తి బాధ్యత వహించాలన్నారు.మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేసియా చెల్లించి, టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పాలక మండలి మొత్తం ఉత్తుత్తి ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తుల కోసం కనీస భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారుమరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు