జర్నలిస్టుల సంక్షేమం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జేఏ మాత్రమే
శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ప్రధాన కార్యాలయంలో మహాసభకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ
పాల్గొని మాట్లాడిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసం అహర్నిశలు పోరాటం చేసేది తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ మాత్రమే అని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నవంబర్ 25వ తారీకున హైదరాబాదులో నిర్వహించబోయే రాష్ట్ర మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలని కోరారు.రాష్ట్ర మహాసభను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు,రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలుకల చిరంజీవి,ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి సైదయ్య,సూర్యాపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుసూదన్,చివ్వెంల మండలం అధ్యక్షుడు చందుపట్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు