శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా చైన్మెన్ ల బదిలీలు…జెడ్సీ ఉపేందర్ రెడ్డి

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 21*

శేరిలింగంపల్లి సర్కిల్ లో
: ఏండ్ల తరబడి ఒకే సర్కిల్‌లో పాతుకుపోయిన పట్టణ ప్రణాళికా విభాగం చైన్‌మన్లకు స్థాన చలనం కలిగింది. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలకు ఉపక్రమించిన శేరిలింగంపల్లి జోనల్‌ అధికారులు ఆ మేరకు క్షేత్రస్థాయిలో దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. ఈ మేరకు శేరిలింగంపల్లి జోన్‌ వ్యాప్తంగా సర్కిళ్లలో పట్టణ ప్రణాళికా విభాగంలో పని చేస్తున్న చైన్‌మన్‌లను బదిలీ చేస్తూ జోనల్‌ అధికారులు సోమవారం ఆదేశాలు చేసారు . ఆయా సర్కిళ్ల డీసీల నుంచి వచ్చిన చైన్‌మన్‌ల పనితీరు నివేదికల ఆధారంగా ఈ బదిలీలను చేసారు. ఇందులో శేరిలింగంపల్లి సర్కిల్‌లో పని చేస్తున్న చైన్‌మన్‌లలో లక్ష్మీనారాయణను యూసుఫ్‌గూడ సర్కిల్‌కు , జావీద్‌ను చందానగర్‌ సర్కిల్‌కు బదిలీ చేసారు. చందానగర్‌ సర్కిల్‌లో పని చేస్తున్న ఐలయ్యను శేరిలింగంపల్లి సర్కిల్ కి కుమారస్వామిలను పటాన్‌ చెరు సర్కిల్‌కు బదిలీ చేసారు. కాగా పటాన్‌ చెరు సర్కిల్‌లో పని చేస్తున్న మల్లేష్‌ను శేరిలింగంపల్లి సర్కిల్‌కు , రాజేందర్‌ను చందానగర్‌ సర్కిల్‌కు బదిలీ చేసారు. చందానగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రవీణ్‌కుమార్‌( గడ్డం శ్రీను)ను పటాన్‌ చెరు సర్కిల్‌కు బదిలీ చేసారు. వీరందరినీ తక్షణమే రిలీవ్‌ చేయాలని జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి తన ఆదేశాలలో పేర్కొన్నారు. జోన్ వ్యాప్తంగా నాక్ ఇంజనీర్లను సైతం బదిలీ చేసినట్లు జోనల్ కమిషనర్ తెలిపారు…కాగా సోమవారం సాయంత్రం కొందరు చైన్‌మన్‌లు తమకే కేటాయించిన కొత్త సర్కిళ్లలో రిపోర్ట్ చేసారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version