దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం
యువత సరైన మార్గం ఎంచుకోవాలి
ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్
భద్రాచలం:పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సోమవారం ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలు అలియాస్ డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు ప్రసాద్ మాట్లాడుతూ.యువతను పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం కానుంది తెలిపారు. చదువుని కష్టంతో కాకుండా, ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు.