బహుజన 9 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వినర్ నాతరి స్వామి
బహుజన 9 న్యూస్ ఛానల్ యాజమాన్యం రూపొందించిన 2025 సంవత్సర క్యాలెండర్ ను శనివారం టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వినర్ నాతరి స్వామి బెల్లంపల్లి పట్టణంలోని అయన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నిరంతరం నిష్పక్షపాతంగా వీక్షకులకు వార్తలు అందిస్తున్న బహుజన 9 న్యూస్ ఛానల్ రూపొందించిన క్యాలెండర్ అద్భుతంగా ఉందన్నారు.
తెలంగాణాతో పాటు అన్ని ప్రాంతాలలోని తెలుగు వీక్షకులకు ఛానల్ మరింత దగ్గర కావాలని నాతరి స్వామి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన బహుజన 9 న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ఛానల్ వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.