*సంగారెడ్డిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం..*
*ముఖ్య అతిథులుగా హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ
చార్మినార్ ఎక్స్ ప్రెస్ రంగారెడ్డి జిల్లా, 17, నవంబర్
*కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్..*
సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి తో కలిసి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై కార్యకర్తలకు వారు దిశా నిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కార్యకర్తలు అంతా సైనికుల పనిచేసి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేలా పనిచేయాలని సూచించారు..